యడ్యూరప్ప రాజీనామా

0
84
యడ్యూరప్ప రాజీనామా
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా

కర్ణాటకా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ఉదయం నుండి జరిగిన పలు నాటకీయ పరిణామాల నేపధ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు యడ్యూరప్ప ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామా ప్రకటనతో శాసనసభ వాయిదా పడింది.
అసెంబ్లీలో విశ్వస తీర్మానం సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడారు.
• కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. జేడీఎస్ ను ప్రజలు తీరస్కరించారు.
• ఎన్నికల్లో ప్రజలు మాపై విశ్వాసం చూపారు.
• బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అతిపెద్ద పార్టీగా మాకు గవర్నర్ ఆహ్వానం అందింది.
• మాకు 104 సభ్యల బలం ఉంది.
• ప్రజలతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నాను.
• ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేకున్నా నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
• లక్షరూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని తాము సంకల్పించాం.
• కాంగ్రెస్ పాలనలో రైతులకు, కార్మికులకు అన్యాయం జరిగింది.
• కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాలు చాలా ఇబ్బందులు పడ్డారు.
• కర్ణాటకు కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసింది.
• కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అన్ని రకాలుగా ఆదుకుంది.
• కాంగ్రెస్-జేడీఎస్ లది అపవిత్ర పొత్తు.
• వృద్దాప్య వితంతు పించన్లు పెంచాలనుకున్నాం.
• ప్రజాస్వామ్యంపై బీజేపీకి అపార విశ్వాసం ఉంది.

యడ్యూరప్ప రాజీనామా


Wanna Share it with loved ones?