కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించిన గవర్నర్

0
56

కర్ణాటక గవర్నర్ యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. గురువారం ఉదయం 9.00 గంటలకు యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాని సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 104 సీట్లు ఉన్నాయి. ఇండిపెండెంట్ గా గెల్చిన అభ్యర్థి తాను బీజేపీ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడంతో బీజేపీ బలం 105కు పెరిగింది. మరో 78 సీట్లున్న కాంగ్రెస్ 38 అసెంబ్లీ స్థానాలను పొంది జేడీఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్దతుతో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటూ జీడీఎస్ గవర్నర్ కలిసినప్పటికీ కర్ణాటక గవర్నర్ మాత్రం అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకే అవకాశం ఇచ్చారు.
గవర్నర్ నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు ప్రకటించింది.

Wanna Share it with loved ones?