కర్ణాటక పీఠం ఎవరికి దక్కుతుంది..?

0
63

కర్ణాటక రాజకీయాలు ఆశక్తిని రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడే పరిస్థితులు దాదాపుగా ఖాయం అయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ 104 సీట్లను, కాంగ్రెస్ 78 స్థానాలను, జేడీఎస్ 37 సీట్లను కైవసం చేసుకోగా ఇతరులు ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుపొందారు. వీటిలో ఒక స్థానాన్ని బీఎస్పీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కనీస మెజార్టీకి ఏ పార్టీకైనా 113 స్థానాలు అవసరం కాగా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ 104 స్థానాలతోనే సరిపెట్టుకునే పరిస్థితి. దీనితో కన్నడ నాట ఎన్నికల తరువాత రాజకీయాలు వేడెక్కాయి.
ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీని అధికారంలోకి రానీయకుండా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పిన కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించడం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్టయింది. దీనితో కుమార స్వామి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరరున్నారు. జేడీఎస్ మద్దతుగా అధికార పీఠంలోకి రావాలని ఆశించిన బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టియంది.
ప్రస్తుత పరస్థితుల్లో సహజంగానే అందరి దృష్టి గవర్నర్ వజుభాయ్ వాలాపై పడింది. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆశక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ మద్దతును స్వీకరిస్తున్నట్టు ప్రకటించిన జేడీఎస్ గవర్నర్ ను కలిసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అటు బీజేపీ మాత్రం అతిపెద్ద పార్టీగా తమకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతోంది. కొన్ని వర్గాల కథనం ప్రకారం గవర్నర్ బీజేపీకి మెజార్టీ నిరూపించుకునేందుకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
కర్ణాటక గవర్నర్ బీజేపీ పార్టీకి చెందిన వాడు కావడం గమనార్హం.

Wanna Share it with loved ones?