కరీంనగర్ లోని ఓ పాఠశాల యాజమాన్యం చిన్నారులను చర్చికి తీసుకుని వచ్చి ప్రార్థనలు చేయించడం వివాదాస్పదం అయింది. స్థానిక గణేష్ నగర్ లోని యచీవర్స్ పాఠశాల యాజమాన్యం ఒకటి, రెండవ తరగత చదువుతున్న విద్యార్థులను చర్చికి తీసుకుని వచ్చారు. క్రైస్తవేతురలను చర్చీలలోకి తీసుకుని వచ్చి ఎట్లా ప్రార్థనలు చేయిస్తారంటూ అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు పాఠశాల నిర్వాహకులను ప్రశ్నించారు. చిన్నారులతో చర్చిలలో ప్రార్థనలు చేయించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏబీవీపీ నాయుకులు చెప్పారు.
అయితే ఫీల్డ్ వర్క్ లో భాగంగా విద్యార్థులను చర్చికి తీసుకుని వచ్చినట్టు పాఠాశాల యాజమాన్యం చెప్తోంది. వివిధ ప్రార్థనా స్థలాలను వారికి పరిచయం చేసే ఉద్దేశంతోనే తాము వారిని చర్చీకి తీసుకుని వచ్చామంటున్నారు. ఇతర మతాలకు చెందిన ప్రాంతాలకు తీసుకుని పోకుండా ఫీల్డ్ వర్క్ పేరుతో కేవలం చర్చీలకు తీసుకుని రావడంలో ఆంతర్యం ఏమిటని ఏబీవీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో చూడండి…