టీడీపీకే జై కొట్టిన కాపులు…!

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో కాపు ఉధ్యమ ప్రభావం ఏమాత్రం కనిపించినట్టు లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జరిగిన ప్రచారం ఆ వర్గం వారు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలంటూ కొంద మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన హడావుడి కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో అసలు కనిపించలేదు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదని కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. కాపులకు టీడీపీ వ్యతిరేకం అన్న ప్రచారాన్ని ఆ వర్గం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. తూర్పు గోదావరి జిల్లాల్లో గట్టి పట్టున్న కాపులు ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల తాము లాభపడదామని ఆశించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు ఫలించలేదు.
కాకినాడలో కాపు ఓటర్లు చెప్పకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. వారి ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ దూసుకుని పోవడాన్ని బట్టి చూస్తుంటే కాపు ఓటర్లు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించినట్టు కనిపిస్తోంది. బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీని గట్టి దెబ్బకొట్టాలనుకున్న వైసీపీ అశాలు గల్లంతయ్యాయి. కాకినాడలో కాపు సమాజిక వర్గం నేతలతో ప్రచారం చేయించడంతో పాటుగా ఆ వర్గానికి చెందిన ముఖ్య నేతలతో చంద్రబాబు జరిపిన మంతనాలు మంచి ఫలితాలను ఇచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *