హింధువుల అణచివేతకు కుట్ర: కమలానంద భారతీ స్వామీజీ | kamalananda bharathi swami

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హింధువుల అణచివేత తీవ్రంగా ఉందని హింధూ దేవాలయాల ప్రతిష్టాపన పీఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామీజీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో హింధువులు మెజార్టీ మతస్తులుగా ఉన్నప్పటికీ వారిని తీవ్రంగా అణచివేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.హింధువులను మతం మారాలంటూ ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.
పేద హింధువులను ప్రలోభాలకు గురిచేయడంతో పాటుగా వారిచేత బలవంతంగా మతం మార్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వామీజీ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న మతప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తిరిగి హింధువులపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
కూకట్ పల్లిలో జరిగిన ఘటనను ఉదహరించిన స్వామీజీ అక్రమంగా మతమార్పిడులకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టి హింధువులపైనే తిరిగి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో దేవరకొండ నుండి కల్వకుర్తి వరకు, నిర్మల్ నుండి కూకట్ పల్లి వరకు హిందువులను అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఇందుకు ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయని కమలానంద భారతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని స్వామీజీ అన్నారు. హింధువల దేవతలను అవమానించిన వారు నేడు బరితెగించి దేవాలయాలను కూల్చే స్థాయికి చేరుకున్నారని ఆయన చెప్పారు. కర్నూలు సమీపంలోని పాణ్యం, గుంటూరు పట్టణాలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
ఒక వర్గానికి చెందిన అధికారులు హింధువల దేవాలయాలను తొలగించేపనిలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. హింధూ అధికారులు చట్టప్రకారం నడుచుకోవడం లేదని వారిపై రకరకాల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని కమలానంద భారతి స్వామీజీ వివరించారు.
హింధువుల అణచివేత కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టప్రకారం కాకుండా ఒక వర్గం వారికి ప్రయోజనం కలిగించే తీరులో వ్యవహరించడం సరికాదని స్వామీజీ పేర్కొన్నారు. హింధువల అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
దేవాలయాల నిర్వహణలో రాజకీయ జోఖ్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన చెప్పారు. దేవాలయాలక నిర్వహణలో రాజకీయ జోఖ్యం సరికాదన్న ఆయన ఇందుకోసమే గ్రామ దేవతల దేవాలయాల రథయాత్ర చేస్తున్నట్టు వివరించారు. దేవాలయాలను రక్షించుకోవడం ద్వారానే హింధుమతాన్ని రక్షించుకోగలుతామని స్వామీజీ వివరించారు.
వివేకనందును బోధనలు యువతకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని స్వామీజీ పేర్కోన్నారు.
kamalakarananda swamiji, kamalakarananda,kamalakarananda swami, kamalakarananda swami ji , telangana, telangana government, andhra pradesh government, panyam, telangana hindu, telangana headlines, telangana headlines news, telangana news, telangana latest news, latest news.
కమలానంద భారతీ స్వామీ రథయాత్ర
కమలానంద భారతీ స్వామీ
కమలానంద భారతీ స్వామీ