కమల్ హాసన్ కు ఎదురుదెబ్బ

తమిళనాడులో రాజకీయ చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. కమల్ రాజకీయాల్లో రాణించే అవకాశాలు లేవని అతనికి అంత సత్తా లేదని కమల్ సోదరుడు చారుహాసన్ కుండబద్దలు కొట్టాడు. కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏంత మాత్రం లేవంటూ చారు హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. సొంత సోదరుడి మద్దతు సంపాదించుకోలేని కమల్ ప్రజల మద్దతు ఏ విధంగా సంపాదించుకుంటారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలసి ముందుకు సాగేందుకు సిద్ధమని ప్రకటించిన కమల్ పార్టీ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. నవంబర్ ఏడో తేదీన కమల్ పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో చారుహాసన్ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులో రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్న కమల్ హాసన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అభిమాల సంఘాలతో చర్చిస్తూ పార్టి విధివిధానాలకు ఖరారు చేసుకునే పనిలో పడ్డ కమల్ హాసన్ కు సొంత ఇంటి నుండే వ్యతిరేకత మొదలైంది. సోదరుడి వ్యాఖ్యలపై కమల్ స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *