షూటింగ్ లో నందమూరి కళ్యాణ్ రామ్ కు స్వల్ప గాయాలు

సినీ హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ కు ఓ సినిమా షూటింగ్ లో గాయాలు అయినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జయేంద్ర దర్శకత్వంలో వికారాబాద్ లో జరుగుతోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. ఈ షూటింగ్ లోనే కళ్యామ్ రామ్ గాయపడినట్టు చిత్ర నిర్మాత తెలిపారు. కళ్యాణ్ రామ్ కు రెండు రోజుల క్రితం గాయాలు అయినప్పటికీ షూటింగ్ కు ఇబ్బంది కలక్కూడనే ఉద్దేశంతో పేయిన్ కిల్లర్ల వేసుకుని మరీ షుటింగ్ కు హాజరయ్యారని మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కళ్యాణ్ రామ్ నిబద్దతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.