ముస్టి మూడు సీట్లకోసం కోదండరాం వెంపర్లాట: కేటీఆర్

kalvakuntla taraka rama rao తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ముస్టి మూడు సీట్ల కోసం కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జన సమితి తమని తాము చాలా ఎక్కువగా ఊహించుకుందని, రాష్ట్రంలోని అన్ని సీట్లలోనూ పోటీచేస్తామని, టీఆర్ఎస్ ను అధికారంలో నుండి దించుతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కోదండరాం ఇప్పుడు కోవలం మూడు సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీని అడుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పుకున్న కోదండరాం ఇప్పుడు ఎందుకు వెన్నుచూపి పారిపోతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అటు ఢిల్లీలోనూ ఇటు అమరావతిలోనూ కోదండరాం తాకట్టు పెడుతున్నారని అన్నారు. తెలంగాణ స్వాభిమానాన్ని వాళ్ల కాళ్లదగ్గరపెడుతున్న ఆపెద్ద మనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటాయో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. వారితి అవకాశ పొత్తుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్, తెలుగుదేశంలది అపవిత్ర కలయిక అని చెప్పిన కేటీఆర్ వారు ఏ ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ వారితో ఏవిధంగా పొత్తు పెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బలం తెలంగాణలో ఏమాత్రం ఉందో తెలుసుకుని మాట్లాడాలని కేటీఆర్ సూచించారు.
టీఆర్ఎస్ పై కొండా దంపతులు చేసిన ఆరోపణలపై కూడా కేటీఆర్ స్పందించారు. పార్టీ నుండి బయటికి వేెళ్దామని నిర్ణయించుకున్న తరువాత నాలుగు రాళ్లు వేసి వెల్లడం సహజమేనని అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు నోరెత్తని వాళ్లు తీరా పార్టీ నుండి వెళ్లే ముందు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అవతలి పార్టీ మెప్పుకోసం ప్రయత్నిస్తూ మాపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ దయ్యబట్టారు.

నేరస్థులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోలేం:సుప్రీం కోర్టు