కే.ఏ.పాల్ కు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసా…?

0
76
K a paul missing

కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ హడావుడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ను నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఏ మాత్రం పట్టింటుకున్నట్టు కనిపించడం లేదు. కే.ఏ.పాల్ ఎప్పుడు టీవీ లైవ్ లలో పాల్గొన్నా వాటి టీఆర్పీ రేటింగ్ లు భారీగానే ఉండేవి. అయితే పాల్ ను కేవలం వినోదం కోసం మాత్రమే ప్రజలు చూసినట్టుగా కనిపిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన అధినేతలతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని దేశ రాజకీయ చరిత్రను మారుస్తానంటూ పాల్ చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకున్న పాపాన పోయినట్టు కనిపించలేదు. ఇంతకీ నర్సాపురంలో కే.ఏ.పాల్ కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా… కేవలం 2873 ఓట్లను మాత్రమే ఆయన పొందగలిగారు. ఆయనకన్నా కొంత మంది ఇండిపెండెంట్ అభ్యర్తులకు ఎక్కువ సీట్లు వచ్చాయి. మరి దీనిమీద పాల్ గారు ఏమంటారో మరి… నర్సాపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు కైవసం చేసుకోగా ప్రముఖ నటుడు నాగ బాబు మూడో స్థానంలో నిల్చారు.Wanna Share it with loved ones?