జూ.ఎన్టీఆర్ సినిమా కార్యక్రమాని వచ్చిన పవన్ కళ్యాణ్

ఒక అగ్రహీరో సినిమా కార్యక్రమానికి మరో అగ్ర హీరో రావడం తెలుగు సినీ పరిశ్రమలో కాస్త అరుదుగానే జరుగుతుంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హారికా-హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. పూజా కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఎదురేగి ఎన్టీఆర్ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం తరువాత పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఆసయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. నాకివన్నీ భయం చేతులు వణుకుతున్నాయ్‌. క్లాప్‌ కొడుతూ ఏం చెప్పాలి. అని పవన్ కళ్యాణ్ అనడంతో జూ.ఎన్టీఅర్ తో పాటు అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *