రాజ్యసభకు అన్నివిధాలా అర్హుడు సంతోష్

తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్) నుండి జోగగినపల్లి సంతోష్ ను రాజ్యసభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి సేవలను అందిస్తున్న సంతోష్ కు తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. సంతోష్ కు రాజ్యసభ సీటు ఖాయం అయిన విషయం బయటకి రావడంతోనే కొొంత మంది సీఎం బంధువు కు రాజ్యసభ సీటు పల్లవి అందుకున్నారు. ఇప్పటికే పార్టీలో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్, కుమారై కవిత, మేనల్లుడు హరీష్ రావులు పార్టీ పదవుల్లో ఉండగా తాజాగా సంతోష్ కు పదవా అనే విమర్శలు మొదలయ్యాయి.
టీఆర్ఎస్ పార్టీలో జోగినపల్లి సంతోష్ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుగానే పనిచేశారా? ముఖ్యమంత్రి బంధువుగానే అహర్నిశం పార్టీకోసం శ్రమించారా? కేసీఆర్ బంధువుగానే అన్ని సమయాల్లోనూ ఆయనకు అండగా నిల్చున్నారా? పార్టీలోని అధిష్టానానికి కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేసిన సంతోష్ కేసీఆర్ బంధువుగానే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారా? అర్థంలేని వ్యాఖ్యాలతో సంతోష్ కు వ్యతిరేకంగగా విపక్షాలు మాట్లాడడం దారుణం.
సంతోష్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం అనేది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం ఇందులోనూ తలదూరుస్తున్న కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడంపై టీఆర్ఎస్ నాయుకు మండిపడుతున్నారు. పార్టీలో సంతోష్ ను రాజ్యసభకు పంపడం పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. పార్టీకి ఆయన చేసిన సేవలకు ఇది గుర్తింపని అంటున్నారు. పార్టీనే జీవితంగా మార్చుకున్న సంతోష్ పార్టీకోసం ఎంత శ్రమిస్తాడన్నది ఆయనను దగ్గరగా చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుసు. ప్రతీ క్షణం పార్టీకోసం తపించే ఆయన కేసీఆర్ కు దగ్గరి బంధువు అయినా తన పరిధిని దాటి ఏనాడు ప్రవర్తించ లేదు. పార్టీలోని కోట్లాది మంది సుశిక్షితులైన కార్యకర్తల్లో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. పదవులకోసం పాకులాడే తత్వం ఆయనలో ఎప్పుడు కనిపించలేదు.
టీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక గా చెప్పుకునే అతికొద్దిమందిలో జోగునపల్లి సంతోష్ ఒకరు. కేసీఆర్ కుటంబానికి దగ్గరి బంధువుగా కంటే పార్టీ కార్యకలాపాలను సమన్వయ పరిచే వ్యక్తిగానే టీఆర్ఎస్ ఆయన అందరికీ పరిచయం. పార్టీ వ్యవహారలను నడిపించడంలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ లో సంతోష్ గురించి తెలియని నాయకులే లేరంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్న పార్టీలోని కీలక వ్యక్తికి రాజ్యాంగ పదవిని కల్పించడంలో ఎటువంటి తప్పులేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ లోని కొంత మంది పేరు గొప్ప నేతలు అనవసరంగా ఈ విషయంలో రాద్దాతం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని తగ్గించుకుని ముందుగా తమ పార్టీ వ్యవహారాలపై దృష్టిపెట్టాలంటున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీతో పాటుగా పార్టీ పెద్దలను నోటికి వచ్చినట్టు తిట్టిన నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున వకాస్తా పుచ్చుకుని సంతోష్ పై చేస్తున్న వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
ఉధ్యమాల్లో సంతోష్ పాల్గొనలేదని చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉధ్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో సంతోష్ ఒకరని వారు చెప్తున్నారు. ఉధ్యమం చేయడం అంటే ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రచార కాంక్ష బొత్తిగా లేని సంతోష్ కార్యకర్తల్లో ఒకరుగా ప్రతీ దశలోనూ కనిపిస్తాడని వారు చెప్తున్నారు. రాజ్యసభకు సంతోష్ ను పంపడం అన్ని విధాలుగా సరైందని వారు పేర్కొంటున్నారు.
పార్టీలోని మేధావి వర్గం ప్రతినిధిగా సంతోష్ కుమార్ పెద్దల సభకు వెళ్లడం సరైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.