ప్రియురాలికోసమే కోటీశ్వరుడి హైజాక్ నాటకం…

0
59

అతను వందల కోట్ల ఆస్తికి వారసుడు… ముంబాయిలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు…తన గర్లఫ్రెండ్ కోసం అతను చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆ వ్యాపారి పీకల మీదకు తెచ్చింది. జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితితో పాటుగా ఆస్తులను కోల్పోవాల్సిన ప్రమాదం తలెత్తింది. ముంబాయి-ఢిల్లీ విమానంలో హైజాక్ డ్రామా ఆడిన వ్యాపారి బిర్జూ కిశోర్ సల్లా పై యాంటీ హైజాకింగ్ యాక్ట్ కింద కేసు నమోదయింది. ఇటీవలే ఈ యాక్టును ప్రవేశపెట్టారు. దీనికి కింద నమోదయిన మొదటి కేసు కిశోర్ సల్లాదే కావడం గమనార్హం. ముంబాయి-ఢిల్లీ విమానంలో బాంబులు ఉన్నాయంటూ విమాన టాయిలెట్ లో లేఖను పెట్టడంతో సదరు విమానం అహ్మదాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఆశక్తి కర విషయాలు తెలిశాయి. జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న తన ప్రియురాలితో ఉద్యోగం మాన్పించి తనతో పాటుగా ముంబాయికి తీసుకుని పోవడానికే అతను హైజాక్ డ్రామాను ఆడినట్టు పోలీసులు గుర్తించారు. కేవలం జెట్ ఎయిర్ వేస్ విమానాల్లోనే ప్రయాణించే ఇతకు గతంలో కూడా తన ఆహారంలో బొద్దింక వచ్చినట్టుగా విమానంలో నానా హంగామా చేశాడు. తీరా ఆ బొద్దికంను కిశోర్ తనతో పాటుగా తెచ్చినట్టు తేలడంతో అప్పుడు జెట్ ఎయిర్ వేస్ అధికారుల కాళ్లా వేళ్లా పడి కేసు నుండి తప్పుంచుకున్నాడు. ఇప్పుడు తాజాగా హైజాక్ నాటకానికి తెరతీసి అడ్డంగా బుక్కయ్యాడు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here