జెల్లీఫిష్ ల కాటు -150 మందికి గాయాలు

0
64
jellyfish attack

jellyfish attack … ముంబాయి బీచ్ లలో సేదతీరేందుకు జనం భయపడుతున్నారు. పెద్ద సంఖ్యలో ముంబాయి బీచ్ ను ముంచెత్తిన జెల్లి ఫిష్ ల కారణంగా ఇప్పటివరకు 150 మందికి పైగా గాయపడినట్టు సమాచారం. బ్లూబాటిల్ జెల్లీ ఫిష్ గా పిల్చుకునే వీటిని పోర్చిగీస్ – మ్యాన్ -ఆఫ్ వార్ గా కూడా పిలుస్తుంటారు. విషపూరితమైన ఈ జెల్లి ఫిష్ లు కొరికితే ఆ ప్రాంతంలో తీవ్రమైన నొప్పితోపాటుగా దురద, మంట ఉంటుంది. చిన్న చిన్న చేపలను చంపేశక్తి ఉన్న ఈ చేపల విషం వల్ల మనుషుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకపోయినా నొప్పి, మంట, దురద కొన్ని గంటలపాటు ఇబ్బంది పెడతాయి.
సాధారణంగా ప్రతీ వర్షాకాలంలో జెల్లీ ఫిష్ లు ముంబాయి తీరంలో కనిపిస్తుంటాయి. అయితే అవి తీరానికి కాస్తదూరంలోనే ఉంటాయని అడపాదడపా మనుషుల కరిచిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో ఈ చేపలు ముంబాయి తీరంలో కనిపిస్తున్నాయని, బీచ్ లో కాలు పెట్టిన వారిపై దాడిచేసి కరుస్తున్నాయని వారు చెప్తున్నారు.
నిమ్మకాయ రాస్తే జెల్లీ ఫిష్ కరవడం వల్ల కలిగే నొప్పికి ఉపశమనం లభిస్తుందని తాను చాలా మందికి నిమ్మకాయ రాసినట్టు బీచ్ లోని దుకాణుదారుడు ఒకరు తెలిపారు. గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువ సంఖ్యలో ఈ చేపలు కనిపిస్తున్నాయని ఆయన వివరించాడు. ఇంత పెద్ద సంఖ్యలో ఇవి తీరానికి రావడానికి గల కారణాలు మాత్రం తెలియదని ఆయన పేర్కొన్నాడు.
ముంబాయి తీరాన్ని జెల్లీ ఫిష్ లు ముంచెత్తడం వల్ల కొద్దిరోజుల పాటుగా ప్రజలు సముద్రం నీళ్లలోకి వెళ్లకపోవడమే మంచిదని స్థానికులు సూచిస్తున్నారు. సముద్రంలో కాళ్లు పెట్టడం, స్నానం చేయడం వంటిని చేయకుండా ఉండాలని చెప్తున్నారు.
blue bottle jellyfish, Portuguese man-of-war were, beaches of Mumbai, jellyfish attack, The venomous sting can kill fish but not humans.
http://www.telanganaheadlines.in/domestic-viole
మానవ మృగాలపై కఠిన చర్యలకు బీజేపీ డిమాండ్
beaches in mumbai

Wanna Share it with loved ones?