కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

కంచి పీఠాధిపతి జయోంద్ర సరస్వతి శివైక్యం పొందారు. తీవ్ర ఆనారోగ్యంతో కంచిలోని ఏబిఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి కంచి పీఠానికి ఆయన 69 పీఠాధిపతిగా ఉన్నారు. 1935లో తంజావురులో జన్మించిన ఆయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్ 1954 ఆయన సన్యాసం స్వీకరించి జయేంద్ర సరస్వతిగా మారారు. అధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా జయేంద్ర సరస్వతి సామాజిక కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గేనే వారు . పీఠం ఆద్వర్యంలో నడిచే పాఠశాలలు, ఆస్పత్రుల పనితీరును నిరంతరం పర్యవేక్షించే జయేంద్ర సరస్వతి భక్తుల పక్షపాతిగా పేరు సంపాదించుకున్నారు.
చెరగని చిరునవ్వుతో ఆయన ప్రతీ భక్తుడిని పలకరించేవారు. భక్తుల యోగక్షేమాలు అడిగితెలుసునేవారు. కొన్ని వేల మంది భక్తులను పేరుపెట్టి పిలవడం ఆయన ప్రత్యేకత. ఆయన అనుగ్రహభాషణాకోసం నిత్యం వేలాది మంది ఎదురుచూస్తుంటారు. చల్లని మాటలతో భక్తులకు సాంత్వన చేకూర్చే కంచి స్వామి శివైఖ్యం పొందడంతో ఆయన భక్తులు విషాధంలో మునిగిపోయారు.