ప్రజలు ఆశీర్వదిస్తే జనసేన దే అధికారం:పవన్ కళ్యాణ్

0
100
జనసేన అధినేత పవన్ కళ్యాణ్
janasena

ప్రజలు ఆశీర్వదిస్తే 2019 ఎన్నికల్లో జనసేన ఫార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ మాట్లాడుతున్న సమయంలో ఆయన అభిమానులు ‘సీ.ఎం..సీఎం..’ అంటూ నినాదాలు చేయడంపై స్పందించిన పవన్ కళ్యాణ్ మీరు అరిస్తే ముఖ్యమంత్రిని కాను ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు జనసేన పోటీచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన తన అభ్యర్థులను నిలబెడుతుందన్నారు. సరికొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుందామని, దోపిడీదారులు, కుట్రదారులను పక్కనపెట్టి జనసేన ప్రభుత్వాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నానని తాను ప్రజలకోసం నిరంతరం శ్రమిస్తున్నానని తనతో పాటుగా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడితో జనసేన అధికారంలోకి కావడం ఖాయమన్నారు. అయితే ముఖ్యమంత్రిని అయిపోదామనే కోరికతో తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తనకు పదవీకాంక్షలేదన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని చేపడతానని అన్నారు.
కొత్త ఏర్పడిన రాష్ట్రానికి పాలనా అనుభవం ఉన్న నేత కావాలనే ఆలోచనతోటే తాను 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం తప్పేనని అందుకోసం ప్రజలందరినీ క్షమాపణ కోరుతున్నట్టు జనసేనాధిపతి చెప్పారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకునిపోయిందని అవినీతిలో దేశంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకుందన్నారు. తాను దిల్లీలో కూర్చొని ఆడిస్తే ఆడే బొమ్మను కాదని, భయపడే వ్యక్తినయితే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను అధ్యయనం చేస్తున్నామని ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయో ఆగస్టు పర్యటనలో చెబుతానని అన్నారు.
అందరి అభివృద్ధి కోరుకునే పార్టీ జనసేన అని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదన్నారు. హోదా కోసం ఎందుకు ఉధ్యమించడంలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబు భయపడటానికి కారణం..ఓటుకు నోటు..లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ అంటూ వ్యఖ్యానించారు. హోదా కోసం చంద్రబాబు నాయుడు ఉత్తిత్తి పోరాటాలు చేస్తున్నారని అయన ఆరోపించారు. ఆయన చేస్తున్న పోరాటాల్లో నిజాయితీ కనిపించడం లేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను గెల్చినా గెలవకపోయినా ప్రజలను మాత్రం మోసం చేయనని అన్నారు. ఏపీ ప్రతిపక్షం కూడా సరిగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రజాసమస్యల విషయంలో గానీ, ప్రత్యేక హోదా విషయంలో గానీ ప్రతిపక్షం చేయాల్సినంత పోరాటం చేయడం లేదన్నారు. తాను ఎవరిచేతిలోనూ కీలుబొమ్మను కానని ఎవరో ఆడిస్తుంటే ఆడే రకాన్ని కాదన్నారు. తనను ఎవరూ భయపెట్టలేరని, భయపడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
జనసేన సంస్కారం ఉన్న పార్టీ అని ఓట్లను కొనుక్కునే నీచ స్థాయికి తమ పార్టి దిగజారదని అన్నారు. శత్రువుకు ఆపద వచ్చినా వారికి అండగా నిలబడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
pavan kalyan, pawan kalyan, janasena, janasena party, pawan kalyan.

గరిష్ట స్థాయికి చేరుకున్న చమురు ధరలు


పేట్ల బురుజు ఆస్పత్రికి ఆధునిక సౌకర్యాలు
పవన్ కళ్యాణ్ ట్విట్టర్

Wanna Share it with loved ones?