జమ్ము అత్యాచార ఘటనలో అసలు నిజాలు… | Jammu girl rape case

జమ్ము లోని జరిగిన 8 సంవత్సరాల బాలిక పై అత్యాచారం, హత్య ఘటనకు అసలు కారణంగా ఆధిపత్యపోరుగానే స్పష్టం అవుతోంది. బాలికను అపరించి అత్యాచారం చేసిన తరువాత హత్యచేసి స్థానిక అడవుల్లో పడేసిన ఘటనకు అసలు కారణం స్థానికంగా నెలకొన్న పరిస్థితులే. ఏనిమిది సంవత్సరాల బాలికను అపరించడం, హత్య చేయడానికి అసలు కారణాలు స్థానికంగా ఆ వర్గానికి చెందినవారిని భయబ్రాంతులకు గురిచేయడంతో పాటుగా అఘాయిత్యానికి పాల్పడిన వర్గంలో గూడుకట్టుకున్న ఆగ్రహం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ములో హింధువుల ఆధిపత్యం ఎక్కువ. ఒక్కప్పుడు కాశ్మీర్ లోనూ పెద్ద సంఖ్యలో హింధువులు ఉన్నప్పటికీ వారి సంఖ్య నేడు కనీస స్థాయికి పడిపోయింది. లోయలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా హింధువులు జమ్ముతోపాటుగా దేశంలోని పలు ప్రాంతాలకు పొట్టచేతపట్టుకుని వలసపోయిన సంగతి తెలిసిందే.
జమ్ములో హత్యకు గురయిన బాలిక స్థానిక సంచార ముస్లీం జాతికి చెందిన బాలిక. సంచార జాతికి చెందిన వారు ప్రధానంలో కాశ్మీర్ లో ఉంటారు. అక్కడి నుండి జీవనోపాధికోసం వేసవి ముందు జమ్ముకు చేరుకుని స్థానికంగా తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తుంటారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వారితో సంచార జాతులవారికి నిత్యం ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి.
తమకు చెందిన భూముల్లో సంచార జాతికి చెందిన ముస్లీంలు బలవంతంగా ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరుచుకోవడంతో పాటుగా తాత్కాలికంగా సాగుచేసుకోవడం స్థానికలకు వారికి గొడవలు తెచ్చిపెడుతున్నాయి. పలుమార్లు దీనిపై రెండు వర్గాలు ఘర్షణలకు సైతం దిగాయి. తమను కాశ్మీర్ నుండి పూర్తిగా పంపేసిన ముస్లీంలు ఇప్పుడు జమ్ముపై కూడా పాగావేయడం స్థానికంగా ఉధ్రిక్తతలకు దారితీస్తోంది.
ఈ క్రమంలోనే ఎనిమిమంది నిందితులు సంచార జాతులకు చెందిన బాలికను కిడ్నాప్ చేసి పలు దఫాలుగా అత్యాచారం చేశారు. చిన్నారిని బలవంతంగా మత్తులో దింపిమరీ వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. ముస్లీంలను భయబ్రాంతులకు గురిచేయడం కోసం బాలికను హతమార్చి స్థానిక అడవుల్లో పడేశారు. చిన్నారి హత్యాచార ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా మీడియా ఈ ఘటనకు విశేష ప్రాధాన్యం ఇస్తోంది.
జమ్ములో చిన్నారి పై అఘాయిత్యం ఆతరువాత జరిగిన ఘటనలు మతం రంగు పులుముకున్నాయి. నిందితులకు స్థానిక హింధువులు మద్దతుపలికారు. అనవసరంగా వారిని వేధింపులకు గురిచేస్తున్నారని జమ్ము కాశ్మీర్ పోలీసులతో కాకుండా సీబీఐతో ఘటనపై విచారణ జరిపించాలనేది వారి డిమాండ్. బాలిక పై అత్యాచార ఘటనను గోరంతలు కొండతలు చేసి చెప్తున్నరనేది వారి వాదన. ఘటన జరిగి మూడు నెలలు దాటిందని ఇప్పుడు దీన్ని తెరపైకి తేవడం వెనుక పెద్ద కుట్రే ఉందని వారుంటున్నారు.
బాలికను హత్య చేసిన వారిని ఖటినంగా శిక్షించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనిపై అనేక మంది ప్రముఖులు స్పందించారు. సినీ రంగం నుండి క్రీడారంగం దాకా అనేక మంది సెలబ్రిటీలు ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమాయకు చిన్నారని పొట్టనపెట్టుకున్న వారిని తీవ్రంగా శిక్షించాలనేది వారి డిమాండ్.
ఎవరి వాదనలు ఎట్లా ఉన్నా అధిపత్యం కోసం, మరో వర్గంవారిని భయపెట్టడం కోసం అభం శుభం తెలియని బాలికపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం క్షమించరానిది.
విపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. దేషులను ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వయంగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటు ఉత్తర్ ప్రదేశ్ లో ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పై అత్యాచారం ఆరోపణలు రావడంతో కేంద్ర ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది.
jammu,jammu rape, jammu rape case, rape in jammu.
latesh
Jammu
Jammu_Division
Vaishno_Devi
Katra