జల్లికట్టుకు సూపర్ స్టార్ల మద్దతు

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులోని కొన్నిప్రాంతాల్లో నిర్వహించే జల్లి కట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడం పై తమిళనాడులో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. జల్లి కట్టును యాధాతదంగా నిర్వహించాలంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడులు వస్తున్నాయి. జల్లికట్టును నిర్వహించి తీరాల్సిందే అద్ వాదనకు తమిళనాడులో సాధారణ ప్రజానీకంతో పాటుగా రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మద్దతు పలుకుతున్నారు. కొంత మంది సుప్రీం కోర్టులో వాదించినట్టుగా జల్లికట్టు అనేది జంతువులను హింసించే ఆట కాదని జంతువులను ప్రేమించే ఆటగా వాళ్లు చెప్తున్నారు. కొద్ది వేల సంవత్సరాలుగా జల్లికట్టును ఆడుతున్నారని ఇప్పుడు హఠాత్తుగా జల్లికట్టుని నిషేధించడం సమంజసం కాదని వారంటున్నారు. క్రీ.పూ నుండి జల్లికట్టును ఆడుతున్నారని వారు చెప్తున్నారు.
జల్లికట్టు కారణంగా ఒక వ్యక్తి మరణించడంతో దాన్ని నిషేధించాలంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం కోర్టు 2014లో తీర్పు చెప్పింది. సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సంక్రాంతి మరుసటి రోజున తమిళనాడు లోని నిర్వహించే జల్లికట్టుకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అనాదిగా ఈ జల్లికట్టును ఇక్కడ ఆడడం సప్రదాయం.
తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ లు కూడా జల్లికట్టును సమర్థించారు. జల్లికట్టును నిషేధిస్తే బిర్యాని ని కూడా నిషేధించాలంటూ కమల్ వాదిస్తున్నాడు. జల్లి కట్టు వల్ల జంతువులకు ఎటువంటి హాని జరగడం లేదని ఆయన చెప్తున్నాడు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణం అని కమల్ వాదిస్తున్నాడు. సూపర స్టార్ రజనీ కాంత్ కూడా జల్లి కట్టును అనుకూలంగా వాదిస్తున్నడు. జల్లికట్టును నిషేధించాల్సిన  అవసరం లేదని రజని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *