జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

సిట్టింగ్ అభ్యర్థి మరణించినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల మధ్య పార్లమెంటు వాయిదా వేయకుండా సభను నడుపుతున్నట్టు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. సభ్యుడు ఇ.అహ్మద్ మరణించడం భాదాకరమని స్పీకర్ అన్నారు. ఆయన మరణంపై తమకు బాధగా ఉన్నప్పటికీ బడ్జెట్ కు ఉన్న ప్రధాన్యత దృష్ట్యా సభను నడుపుతున్నామని సభలో అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెడతారని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సభ్యుల నిరసన మధ్య అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *