లష్కర్ తీవ్రవాద సంస్థ కాదట-పాక్ మాజీ అధ్యక్షుడి ఉవాచ

ఉగ్రవాద సంస్థలుగా ప్రపంచం యావత్తూ గుర్తించిన లష్కరే తోయిబా, జైష్ – ఇ-మహ్మద్ లాంటి సంస్థలు ఉగ్రవాద సంస్థలు కాదని సెలవిస్తున్నారు పాకిస్థాన్ మాజీ ఆధ్యక్షుడు పర్వేష్ ముషరఫ్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాను లష్కరేకు అతిపెద్ద మద్దతు దారుడిగా ప్రకటించుకున్న ఈయనగారు తాజాగా ఈ సంస్థలతో కలిసి రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. ఈ క్రమంలోనే అసలు లష్కర్ లాంటి సంస్థలు అసలు ఉగ్రవాద సంస్థలే కాదని దీనిపై అమెరికా తో సహా ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నాడు.
ఈ ఉగ్రవాద సంస్థలు అనేక స్వచ్ఛంధ కార్యక్రమాల్లో పాల్గొన్నాయంటూ ముషరఫ్ ప్రకటిస్తున్నాడు. ఈ రెండు సంస్థలతో పాటుగా పాకిస్థాన్ లోని ఇతర మత సంస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్న ఈయన ఇప్పటివరకు రాజకీయ కూటమిపై చర్చలు మాత్రం జరగలేదంటున్నాడు.
అమెరికాలో ఉగ్రవాద, మత సంస్థల ప్రాబల్యం నాటినాటికి పెరుగిపోతున్నది. వాటిని కట్టడి చేయాలంటూ భారత్ తో సహా ప్రపంచదేశాలు ఎంత మొత్తుకున్న పాకిస్థాన్ వాటిని పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో అమెరికా పాకిస్థాన్ కు గట్టి హెచ్చరిక కూడా చేసినా పాక్ బుద్ది మారడం లేదు.