జగన్ కు భారీ ఎదురుదెబ్బ

0
50

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘనం విజయం సాధించడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ 15 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి మరీ ప్రచారం జరిపారు. తమ పార్టీ నుండి పోటీ చేసి గెల్చి ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ సీటు తమ పార్టీదే అని అందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జగన్ ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకుని ఆయనకు టికెట్టిచ్చారు. నంద్యాలలో భూమా కుటుంబానికి బద్దవైరం ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ముందు టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ ఇరు కుటుంబాల మధ్య మొదటి నుండి బద్దవైరమే ఉంది.
ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేయడం జగన్ నంద్యాలలో మకాం వేయడంతో ఈ ఉప ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఆశక్తిని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉరితీసినా పాపం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. జగన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగినప్పటికీ తిరిగి అదే తరహా వ్యాఖ్యలు చేసిన జగన్ 15 రోజుల పాటు నంద్యాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. ఇరు పార్టీలు ఎన్నిక్లలో గెలుపొందడం కోసం సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేశాయి. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ గెలుపుకోసం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. భూమా కుటుంబంలో టికెట్ వ్యవహారంలో వచ్చిని విభేదాలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసినా అవేవీ ఫలించలేదు. కుటుబం సభ్యులంతా ఏక తాటిపై నిలవడం. భూమా అన్న కుమారుడికి టికెట్ రావడంతో అప్పటి వరకు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన తనకే టికెట్ ఇవ్వాలంటూ శిల్పా చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు తోసిపుచ్చడంతో ఆయన వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు.
నంద్యాలలో సత్తా చాటేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. కనీసం గట్టి పోటీని సైతం శిల్పా మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను నియమించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఈ సీటును సైవసం చేసుకోవడంతో జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక కాకినాడ ఓటర్లపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశలు పెట్టుకుని కూర్చుంది. ఇక్కడి స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో మరి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here