జేఏసీ సభ విజయవంతం అవుతుందా..?

0
57

పొలువులకై కొట్లాట సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ జేఏసీ కసరత్తులు చేస్తోంది. సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నుండి అనుమతి రాకపోవడంతో కోర్టు ద్వారా అనుమతి సాధించుకున్న తరువాత సభను ఎట్లాగయినా విజయవంత చేసి సత్తా చాటుకునేందుకు జేఏసీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ జేఏసీ ఉనికిని కాపాడుకునేందుకు ఈ సభ అత్యంత అవసరమని భావిస్తున్న నేతలు ఆ మేరకు పూర్తి కసరత్తులు చేస్తున్నారు. జేఏసీ ఛైర్మన్ కోదండరాం సహా మిగతా నేతలంతా ప్రస్తుతం సభను ఏ విధంగా విజయవంతం చేయాలా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ జేఏసీ నిర్వహించే సభ పూర్తిగా విఫలం అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న జేఏసీ నేతలు విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం పై నిరుద్యోగులకు నమ్మకం ఉందని జేఏసీ మాయలో తెలంగాణ నిరుద్యోగులు పడరని అంటున్నారు.
ఇటు జేేఏసీ నేతలు మాత్రం తెలంగాణ నిరుద్యోగులను ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణలో ఎవరికీ ఉద్యోగాలు దక్కలేదన్నది వారి ఆరోపణ. తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిని విస్మరించి తెలంగాణ ద్రోహులను పక్కనపెట్టుకున్న కేసీఆర్ అసలైన పోరాటయోధులను మర్చిపోతున్నారని వారు దుయ్యబట్టారు. సభను విజయవంత చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అయితే ప్రభుత్వం సభను ఏ విధంగానైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అంటున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here