అంతరిక్ష రంగంలో భారత పతాకం రెపరెపలాడింది. అగ్రదేశాలకు సాధ్యం కాని పనిని మన శాస్త్రవేత్తలు సుసాధ్యం చేశారు. రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఓకేసారి కక్షలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోని మరేదేశమూ ఊహలకో అందని విధంగా ఇన్ని ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్సో చరిత్ర సృష్టించింది. 104 ఉపగ్రహాలను మోసుకుని పోయిన పీఎస్ఎల్పీ-సి37 ముందుగా నిర్ణయించిన ప్రకారం కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం అయిన తరువాత శ్రీహరికోటలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలు ఒకరికొరు అభినందనలు తెలుపుకున్నారు. 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
- ఈ ప్రయోగంతో భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే ఇది ఒక మైలు రాయిగా నిల్చిపోనుంది.
- ప్రస్తుతం ప్రయోగించిన 104 ఉపగ్రహాల్లో మూడు మాత్రమే భారత్ కు చెందినవి కాగా 101 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి.
- సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన పీఎస్ఎల్పీ-సీ37
- 28.42 నిమిషాల్లో రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది.
- ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్-2.. రాకెట్ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోయింది.
- ఐఎన్ఎస్-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్ఎస్-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోయాయి.
- దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి విడిపోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకను సిద్ధం చేశారు.