ఇండోనేషియాలో ఘోర ప్రమాదం 47 మంది సజీవ దహనం

ఇండోనేషియాలో జరిగిన ఘోర ప్రమాదంలో 47 మంది సజీవదహనం కాగా 43 మందికి గాయాలయ్యాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాకు తమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని, భారీ పేలుళ్లు జరిగాయని ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. పేలుడు ధాటిని ఫ్యాక్టరీ భవనం పూర్తిగా కూలిపోయింది. సమీపంలోని అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. భారీ స్థాయిలో పేలుడు జరగడంతో సజీవదహనం అయిన వారి శరీరాలు గుర్తించే పరిస్థితిలో లేవు. పూర్తిగా కాలిపోయి చనిపోయిన వారిని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పేలుడు శబ్దాలు చాలా దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెప్తున్నారు. అగ్నిమాపక శకటాలు అత్యంత కష్టం మీద మంటలను అదుపు చేయగలిగాయి. ఈ ఫ్యాక్టరీలోమొత్తం 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు అధికారులు చేప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *