భారత్ యుద్ధానికి సిద్ధమేనా?

పాకిస్థాన్ తో భారత్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతోందా…? భారత – పాకిస్థాన్ లతో పాటుగా ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇదే విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పుల్వామాలో 40 మంది జవాన్లను దొంగదెబ్బతీసి వారి ప్రాణాలను హరించిన ఉగ్రవాద మూకలతో పాటుగా వారికి ఆశ్రమయం కల్పిస్తున్న పొరుగుదేశం పై దేశం యావత్తు మండిపడుతోంది. దాయాది దేశానికి ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ప్రజల డిమాండ్లకు తలొగ్గుతుందా…? భావోద్వేగాలతో పొరుగదేశంపై యుద్ధానికి సిద్ధపడుతుందా…? అనేది కీలకాశం. యుద్ధం అనేది అంతిమ నిర్ణయం కావాలని దాని వల్ల ఇరు దేశాలకు భారీగా తప్పదనే వాదనలూ ఉన్నాయి.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మిలటరీ వ్యవస్థను కలిగిఉన్న భారత్ ను ఎదుర్కొనే సత్తా పాకిస్థాన్ కు లేకపోయినా పాక్ ను అంత అషామాషీగా తీసేయాల్సిన అవసరం లేదని అన్ని అంశాలను కూలంకషంగా పరిశీంచిన తరువాతే యుద్ధంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఒక వేళ యుద్ధం అంటూ జరిగితే జరగబోయే పరిణామాలాలు కూడా దారుణంగానే ఉంటాయనేది నిపుణులు వాదన.
 పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఇరు దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయి.
 ఇప్పటికే కుంటుతూ నడుస్తున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుంది.
 యుద్ధం జరిగితే ఇరువైపులా అస్తీ ప్రాణ నష్టాలు జరుగుతాయి. పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయే అవకాశముంది.
 ఇరుదేశాల వద్ద అత్యాధునిక ఆయుధాలు పెద్ద ఎత్తునే ఉన్నాయి దీని వల్ల ప్రాణనష్టం భారీగా జరుగుతుంది.
 ఇప్పటివరకు భారత్ పాకిస్థాన్ ల మధ్య నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి. వాటన్నింటిలో భారత్ విజయం సాధించినప్పటికీ యుద్ధాల వల్ల భారత్ కూడా తీవ్రంగా నష్టపోయింది.
 యుద్ధాల కారణంగా వేలాది మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోగా అందుకు రెండు, మూడు రెట్ల సంఖ్యలో సైనికులు గాయపడ్డారు.
 1971 యుద్ధంలో భారత్ దాదాపు 3500 మంది సైనికుల ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
 1965 యుద్ధంలోనే దాదాపు 3000 వేల మంది జవాన్లు అమరులు కాగా అందుకు రెట్టింపు సంఖ్యలో జవాన్లు గాయపడ్డారు.
 1947 యుద్ధంలోనే వేయు మందికి భారత జవాన్ల అమరులు కాగా అందుకు మూడింతలు గాయపడ్డారు.
 భారత్ కన్నా పాకిస్థాన్ కు చెందిన సైనికులు మూడు యుద్ధాల్లోనూ భారీగా ప్రాణాలు కోల్పోయారు.
 ఇరు దేశాలు యుద్ధం వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
 ప్రస్తుతం యుద్ధం జరిగితే నిస్సందేహంగా భారత్ పాకిస్థాన్ ను ఓడించడం ఖాయం. అదే సమయంలో భారత్ కు కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
 ఆర్థికంగా భారత్ కూడా భారత్ నష్టమే.
 భారత్ తో పాటుగా పాకిస్థాన్ కూడా అణ్వయుధ దేశమే. ఇప్పటివరకు ప్రపంచంలో రెండు అణ్వయుధ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగలేదు.