చొరబాటు యత్నాలు-సైన్యం అప్రమత్తం

0
60

భారత్-పాక్ సరిహద్దుల్లో సైన్యం అప్రమత్తమైంది. పెద్ద సంఖ్యలో భారత్ లోకి చొరబాట్లు జరగవచ్చనే అనుమానంతో సరిహద్దుల్లో నిఘాను పెంచారు. పాకిస్థాన్ సరిహద్దుల గుండా భారత్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. కరడుగట్టిన జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు సరిహద్దులకు సమీపంలో ఉన్నట్టు సమాచారం రావడంతో సరిహద్దు భద్రతా దళంతో పాటుగా సైనిక దళాలు పూర్తి అప్రమత్తంతో ఉన్నాయి. ఉగ్రవాదులను సరిహద్దులను దాటించేందుకు గాను పాకిస్థాన్ సైనికులు భారత్ భూబాగంపై కాల్పులకు తెగబడడం అలవాటుగా మారింది. పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరుపుతుంటే దీన్ని ఎదుర్కొనే పనిలో సైన్యం ఉండగా ఈ సందట్లో ఉగ్రవాదులు భారత భూబాగంలోకి చొరబడతారు. అయితే ఇటీవల జరిగిన ఇదే తరహా ప్రయత్నాన్ని భారత సైనికులు వమ్ముచేశారు. ఒక వైపు పాకిస్థాన్ సైనికులకు గట్టిగా బదులిస్తూనే భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన తీవ్రవాదులను సైన్యం మట్టు పెట్టింది.
మరోసారి భారత్ లోకి చొరబడేందుకు తీవ్రవాదులు పొంచి ఉండడంతో సైనికులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఘాను మరింతగా పెంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ లోకి తీవ్రవాదులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here