భారత్-చైనా సైనికుల రాళ్లదాడి

భారత భూబాగంలోకి చొరబడుతూ చైనా భారత్ ను రెచ్చగొడుతూనే ఉంది. సిక్కిం లోకి డోక్లామ్ లో పరిస్థితి పద్దమణకముందే లద్ధాఖ్ లోకి చైనా సైన్యం చొరబాడుకు చేసిన ప్రయత్నాలను భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ఇరు సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భారత్-చైనా లకు చెందిన సైనికులు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్న దృశ్యాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఇరు దేశాలకు చెందిన సైనికులు చాలా సేపు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాళ్లు విసురుకోవడంతో పాటుగా ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలకు కూడా దిగినట్టు కనిపిస్తోంది. ఒక సైనికుడితో కాలితే తన్నడంతో అతను కింద పడిపోయి నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తన్నిన సైనికుడు ఏదేశానికి చెందిన వాడు అనేది మాత్రం తెలియడం లేదు. భారత్-చైనా సరిహద్దుల్లోని లధ్దాక్ ప్యాంగ్యాంగ్ సరస్సు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 15వ తేదీన ఈ ఘటన జరిగింది.
భారత్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా సరిహద్దుల్లోని సైనికులు తుపాకులు లేకుండానే కాపలా కాస్తుంటారు. భారత్ ను ఒత్తిడిలోకి నెట్టేందుకు చైనా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. భారత్ భూభాగం వైపు పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడుతునూ ఉండగా మరో వైపు నుండి చైనా తన బలగాను భారత్ భూభాగంలోకి పంపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *