పాక్ పై సర్జికల్ స్ట్రైక్ తరహా దాడి?

0
52

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ తరచూ భారత్ పైకి కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్ కు భారత జవాన్ల గట్టిగానే జవాబు చెప్పినట్టు తెలుస్తోంది. శనివారం పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఒక సైనిక అధికారితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనితో భారత్ సైనికులుకు ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ బంకర్లను లక్ష్యంగా చేసుకుని భారత జవాన్లు పెద్ద ఎత్తున జరిపిన కాల్పుల్లో 10 మంది వరకు పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు అనధికారవర్గాల సమాచారం. దీని గురించి ఇటు భారత సైనికాధికారలు కానీ పాకిస్థాన్ సైన్యం కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే భారత బలగాలు భారీ ఎత్తున కాల్పులు జరిపాయని పాకిస్థాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ కు భారీగానే ప్రాణనష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది.
పక్కా వ్యూహాంతో భారత బలగాలు వ్యవహరించి పాకిస్థాన్ కు చెందిన కీలక బంకర్లనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తుపాకులతో పాటుగా తేలికపాటి మేర్టార్లను కూడా భారత బలగాలు కాల్పుల కోసం వినియోగించినట్టు సమాచారం. కాల్పుల సమయంలో నియంత్రణ రేఖకు అత్యంత సమీపం నుండి భారత బలగాలు పాకిస్థాన్ పై విరుచుకుని పడ్డాయనే వార్తలు వస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే భారత బలగాలు అత్యంత అప్రమత్తతతో తమ పని పూర్తికానిచ్చాయని తెలుస్తోంది. అయితే భారత బలగాను నియంత్రణ రేఖను దాటకుండానే అత్యాధునిక ఆయుధాల ద్వారా పాకిస్థాన్ కు గట్టి బుద్ది చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. భారత సైనికుల ప్రాణాలు తీసిన పాకిస్థాన్ మూకల పనిపట్టేందుకు నియంత్రణన దాటుకుని కలుగుల్లో దాక్కున ఎలుకలను బయటికి తెచ్చి హతమార్చిన తరహాలోనే ఉగ్రమూకల భరతం పట్టిన భారత బలగాలు ప్రస్తుతం మాటిమాటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత భూబాగం వైపు కాల్పులు జరుపుతున్న పాకిస్థానీ సైన్యానికి గట్టి బుద్ది చెప్పాయి.
ఒక సైనిక అధికారితో పాటుగా నలురుగు సహచరులను కోల్పోయిన భారత సైన్యం పాకిస్థాన్ కు గట్టిగా బుద్ది చెప్పింది. కాల్పులు జరపుతూ ఉంటే ఊరుకునేది లేదని దెబ్బకు దెబ్బతీస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు పంపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here