రోడ్డుపై దిగిన యుద్ధ విమానాలు…

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 16 యుద్ధవిమానాలు హైవే రోడ్డుపై దిగాయి. విమానాశ్రయాల్లో దిగాల్సిన విమానాలు ఏకంగా హైవేపై పరుగులు పెట్టాయి. ఈ విన్యాసాలకు ఆగ్రా-లక్నో జాతీయ రహదారి వేదికగా నిల్చింది. లక్నోకు 65 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై యుద్ధవిమానాలు దిగాయి. వాయుసేన విన్యాసాల్లో భాగంగా విమానాశ్రయాలతో పాటుగా అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారులపై కూడా యుద్ధ విమానాలు దిగగలిగేలా విన్యాసాలు నిర్వహించారు. ఈ విన్యాసాల్లో భాగంగా 35 టన్నుల బరువు ఉండే సి-13- సూపర హెర్యులెస్ విమానం కూడా రోడ్డుపై ల్యాండ్ అయింది.
అత్యవసర సమయాల్లో కేవలం విమానాశ్రయాలపైనే ఆధార పడకుండా అవసరం అయితే జాతీయ రహదారులపైనే విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ఉద్దేశించిన ఈ విన్యాసాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. నిమిషాల వ్యవధిలో విమానాలు రోడ్డుపై దిగడంతో పాటుగా వెంటనే అక్కడి నుండి టాకాఫ్ చేసుకుని పోవడాన్ని ఈ విన్యాసాల్లో చూపించారు. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు జరుపుతున్న సమయంలో ఈ రోడ్డుపై ట్రాఫిక్ ను పూర్తిగా నిషేధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *