వీసా గడువు ముగిసినా అమెరికాలోనే

india illegal immigrants in usa … వీసా గడుపు ముగిసినప్పటికీ అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతోందని అమెరికా అంతర్గత భద్రతా విభాగం అధికారులు వెల్లడించారు. పర్యాటక, వ్యాపారాలక కోసం బీ-1, బీ-2 వీసాలతో పాటుగా అమెరికాలో చదువుకోవడానికి అవకాశం కలిగించే ఎఫ్ విసాలపై అమెరికాకు వెళ్లిన వారిలో చాలా మంది వీసా గడువు తీరినప్పటికీ తిరిగిరాకుండా అమెరికాలోనే ఉంటున్నారని అధికారులు వెల్లడించారు. 2017లో పర్యాటక, వ్యాపార వీసాలపై 10.7 లక్షల మంది అమెరికాకు వచ్చారని అయితే వారిలో 21 వేల వీసా గడువు తీరినప్పటికీ అమెరికాలోనే అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
అమెరికాకు వెళ్లిన వారి సంఖ్య 2016తో పోలిస్తే 2017 పెరిగింది.2016లో దాదాపు 10లక్షల మంది బీ1, బీ2 వీసాల మీద అమెరికా వెళ్లగా 2017లో ఆ సంఖ్య 10.5 లక్షలుగా ఉంది. 2017లో ఎఫ్‌, జే, ఎం వీసా కేటగిరీల కింద భారతీయ విద్యార్థులు రిసెర్చ్‌ స్కాలర్స్‌ 127,435 మంది అమెరికా వెళ్లారు. వాళ్లలో 4,400 మంది తమ వీసా గడువు ముగిసినా ఇంకా అక్కడే ఉంటున్నారు. వివిధ మార్గాల ద్వారా భారత్‌ నుంచి అమెరికాకు 4.5లక్షల వలసదారులు వచ్చారు. వీరిలో 9,568 మంది వీసా ముగియగా.. 2,956 మంది యూఎస్‌ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక 6,612 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు అంత్రగత భద్రతా విభాగం తెలిపింది.
సంవత్సరాలుగా అమెరికాలో విసాగడువు ముగిసినప్పటికీ ఉంటున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. యూఎస్ఏకు వివిధ విసాలపై వచ్చి వీసా గడుపు తీరినప్పటికీ అక్కడే అక్రమంగా ఉంటున్నవారి సంఖ్య 50 లక్షలకు పైగానే ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా పర్యాటక, వ్యాపార, విద్యారంగానికి సంబంధించిన వీసాలపై వచ్చిన వాళ్లు ఇక్కడి నుండి తిరిగి వెళ్లడం లేదని వారు చెప్పారు. డిపెండిగ్ విసాలపై యూఎస్ఏకు వచ్చిన తరువాత వారి మధ్య వివాదాల కారణంగా విడాకులు తీసుకున్న వారు సైతం అక్రమంగానే అమెరికాలో ఉంటున్నారు. అక్రమ వసలదారుల పిల్లలు కూడా అమెరికాలో పుట్టి, పెరినప్పటికీ వారు కూడా సరైన పత్రాలు లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. అమెరికా కొత్త చట్టాల వల్ల అక్రంగా వలస వచ్చిన వారి పిల్లలు కూడా అక్రమ వలసదారులగానే ముద్ర వేయడంతో వారిపరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్న తనంలోనే అమెరికాకు తల్లిదండ్రుల వెంటవచ్చినవారు తీరా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు చేసుకునే సమయంలో అసలు విషయం బయటపడడంతో వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది.
మన దేశం నుండి ప్రధానంగా గుజరాత్, పంజాబ్ లనుండి పెద్ద సంఖ్యలో అమెరికాలో అక్రమంగా నివిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. యూనైటెడ్ స్టేట్స్ లోకి ప్రధానంగా మెక్సీకో నుండి అక్రమంగా వలస వస్తున్నారని వారితో పాటుగా పెద్ద సంఖ్యలో ఇతర దేశాల నుండి వలస వస్తున్నట్టు వివరించారు. భారత్ నుండి అమెరికాకు వస్తున్న వారు మాత్రం సరైన విసాలతో వస్తున్నారని అయితే వీసా గడువు తీరిన తరువాత కూడా అక్రమంగా అక్కడే నివాసం ఉంటున్నారని చెప్పారు.

"ఇద్దరు " నింగికెగసారు


మెరినా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు
Indian_Americans