వాడవాడలా ఎగిరిన మువ్వన్నేల జెండా

భారత 72వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వాడవాడలా మువ్వన్నేల జెండా రెపరెప లాడింది. దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక ఎర్రకోట నుండి ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
* గత నాలు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను గురించి ప్రధాని వివరించారు.
* స్వచ్చ భారత్, ప్రధాన మంత్రి పంట భీమా యోజన, ముద్రా రుణాలు, జీఎస్టీలను ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు.
* ఎర్రకోట వేదికకు కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఆయుష్మాన్ భారత్ ను ప్రధాని మోడీ ప్రకటించారు.
* ఈ పథకం ద్వారా దేశంలోని పేద ప్రజానీకానికి ఆరోగ్యసేవలు అందుబాటులో ఉంటాయని ప్రధాని చెప్పారు.
* ప్రపంచంలోనే అతి పెద్ద భీమా పథకం గా దీన్ని ప్రధాని అభివర్ణించారు.
* కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు భీమా సౌకర్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది.
* 10 కోట్ల కుటుంబాలు, సుమారు 50 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు.
* దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సెప్టెంబర్ 25వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
* పన్ను చెల్లింపుదారులు పెద్ద సంఖ్యలో పెరగడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
* ఇలా మంచి పనులు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు.
* ఓ నిజాయితీపరుడైన పౌరుడు చెల్లించే పన్నులతో మూడు పేద కుటుంబాలకు ఆహారం లభిస్తుందని, ఆ పుణ్యం పన్ను చెల్లించే వారికే వస్తుందని అన్నారు.
* మధ్య తరగతి వేతన జీవులు నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నారని మోదీ ప్రశంసించారు.
* పన్ను చెల్లింపు దారులు దేశానికి గొప్ప సేవచేస్తున్నారంటూ ఆయన కొనియాడారు.
* భారత్ ప్రగతి పథంలోకి దూసుకుని పోతోందని అన్నారు.
* శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచంలోని అతి గొప్ప దేశాల సరసన చోటు సంపాదించుకుందని ప్రధాని పేర్కొన్నారు.
Prime Minister Narendra Modi, Swachch Bharat, PMFBY, Mudra loans, GST.

Aayuhmaan Bharat, Red Fort.