ఇమేజ్ టవర్ కు శంకుస్థాపన

ఇప్పటికే ఐటి, ఫార్మా, వైద్య రంగాల్లో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించున్న హైదరాబాద్ ఇక యానిమేషన్-గోమింగ్ రంగాల్లోనూ దూసుకుని పోనుంది. ఈ రంగాల్లో భారీ అభివృద్దికి ఊతమిచ్చేలా చేపడుతున్న ఇమేజ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 946 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 100 అడుగల ఎత్తులో నిర్మిస్తున్న ఈ భారీ భవనానానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఈ టవర్ ను నిర్మిస్తున్నారు. రాయదుర్గంలోని 10 ఎకరాల స్థలంలో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. ఇందులో 16 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలం అందుబాటులోకి రానుంది. దీని వల్ల 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.
ఇమేజ్ టవర్ నిర్మాణానికి శంఖుస్తాపన చేసిన తరువాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ యూనిమేషన్ పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తోందని చెప్పారు. ఈ రంగంపై ఆశక్తి ఉన్న యువకులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యానిమేషన్-గేమింగ్ రంగాల్లో హైదరాబాద్ ను ప్రపంచంంలోనే మేటిగా నిల్పేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా మారుతోందని అన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాభివృద్దిలో గొప్ప మార్పులు రానున్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *