హైదరాబాద్ లో పార్కింగ్ బాదుడు ఉండదిక | free parking for hyderabd people

హైదరాబాద్ లో పార్కింగ్ బాదుడికి జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. సినిమా ధియేటర్లు, ,షాపింగ్ మాల్స్ లలో వినియోదారుడికి ఖచ్చితంగా ఉచితంగా పార్కింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలని నిర్ధేసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ జీహెచ్ఎంసీ ఈ తరహా ఉత్తర్వులను గతంలోనే ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సినిమా ధియేటర్ల యజమానులు, షాపింగ్ మాల్స్ యదేచ్ఛగా పార్కింగ్ దోపిడీని సాగిస్తున్నాయి. సినిమాకు వచ్చిన వారి నుండి ముక్కుపిండీ మరీ పార్కింగ్ రుసుమును వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏప్రిల్ 1వ తేదీనుండి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేశారు. షాపింగ్ మాల్స్ లో కేవలం వినియోగదారుడికి మాత్రమే పార్కింగ్ ఉచితంగా ఇస్తారు. ఇందుకు గాను మాల్స్ లో కొనుగోలుకు సంబధించిన రశీదును వాహనయజమాని చూపించాల్సి ఉంటుంది. ఇదే తరహాలోనూ సినిమా ధియేటర్లలోనూ సినిమా టికెట్ ను చూపించాలి.
telangana, hyderabad, hyderabad parking, cinema theatre, hyderabad cinema parking, ghmc, hyderabad municipal corporation, parking problem in hyedrabad,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *