బాగుపడనున్న హైదరాబాద్ రోడ్లు

hyderabad roads హైదరాబాద్ రహదారులకు మోక్షం కలగలనుందా? నరకం చూపిస్తూన్న మాహనగర రోడ్లకు మరమ్మత్తులు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వానలు, ఇతరత్రా కారణాల వల్ల ధ్వంసమైన రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించి గుంతలను పూడ్చాలని నిర్ణయించారు.త్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లు, ప్రధాన కూడళ్లలో ఈ గుంతల కారణంగా తరుచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండటంతో రోడ్ల నిర్వాహణ పనులపై నేరుగా కమిషనర్ దృష్టి సారించారు. ప్రజల నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు కమిషనర్ దాన కిషోర్ గడువును విధించారు.
ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన దాన కిశోర్ రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. వచ్చే నెల 10వ తేదీలోపు గుంతలన్నీ పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. గుంతలు పూడ్చివేతకు గాను ప్రత్యేకంగా దివేల బ్యాగ్‌ల షెల్వాక్ మిశ్రమాన్ని కొనుగోలు చేయాలని చీఫ్ ఇంజనీర్ జియావుద్దిన్‌ను ఆదేశించారు. గుంతలను తక్షణమే పూడ్చివేసేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఇన్‌స్టెంట్ రిపేర్ టీం(ఐఆర్‌టీ) వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రూ.721 కోట్ల వ్యయంతో 800 లేన్ కిలోమీటర్ల పీపీఎం రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 200 లేన్ కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.వర్షాల వల్ల రోడ్లపై ఏర్పడిన గుంతలను వర్షం తగ్గిన అయిదారు గంటల్లోపు పూడ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణం ఇతర ఇంజనీరింగ్ పనుల్లోనాణ్యత ప్రమాణాలపై రాజీపడేది లేదని సూచించారు.
హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారయిన సంగతి తెలిసిందే. వర్షాలకు రోడ్లు పాడవడంతో పాటుగా వివిధ ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు రోడ్లను అడ్డంగా తవ్వేశారు. చాలా చోట్ల మంటి పైపులైన్ల కోసం తవ్విన గుంటలకు పూడ్చలేదు. నగరంలో పెద్ద ఎత్తున జరుగుుతన్న మంచినీటి పైపు లైన్ల ఏర్పాట్లు వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. దీనికి తోడు ఒకరి వెంట ఒకరు రోడ్లను ఇష్టానుసారం తవ్వుకుంటూ పోతున్నారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకే రోడ్లు అద్వాన్నంగా తయారయ్యాయి. ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంట ఉందో కూడా తెలియని పరిస్థితి.
hyderabad, hyderabad roads, hyderabad roads situation, ghmc, dana kishore.

పడిపోయిన రూపాయి విలువ-డాలరుకు 71 రూపాయలు