తొలిరోజే చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో….

0
54

హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన తొలిరోజునే రికార్డులకెక్కింది. దేశంలోని ఏ మెట్రోలో లేనట్టుగా తొలిరోజునే హైదరాబాద్ మెట్రోలో 2లక్షల మంది ప్రయాణించారు. ఇతర మెట్రో లను ప్రారంభించిన సమయంలో వాటిలో 50 వేల మందికన్నా ఎక్కువ మంది ప్రయాణించిన దాఖలాలు లేవు. తొలిరోజునే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడంపై మెట్రో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజున ఎదురైన చిన్న చిన్న సమస్యలను కూడా అధికమిస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముడు రోజుల పాటు సెలవలు రానున్న నేపధ్యంలో పెద్ద సంఖ్యలో మెట్రోలో ప్రయాణించేందుకు ప్రజలు వస్తారని మెట్రో అధికారులు అంచానా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు మెట్రో అధికారులు వివరించారు. తొలిరోజున చిన్న చిన్న సమస్యలు తప్ప ఎటువంటి ఇబ్బుందులు ఎదురుకాలేదని మెట్రోఅధికారులు చెప్తున్నారు. దేశంలోని మరో ఇతర మెట్రోల తొలిరోజునే ఇంత పకడ్బందీగా రైళ్లు తిరగలేదని వారు వివరించారు. నిర్మాణ సమయంలోనే అనేక రికార్డులను నెలకొల్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు ప్రారంభమైన తొలిరోజునే పెద్ద ఎత్తున ప్రయాణికులను ఆకర్షించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here