ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలోనూ మెట్రో పరుగులు

0
80
hyderabad metro rail

ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో కారిడార్ ప్రారంభమైంది. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ నగరవాసులు ఎదురు చూస్తున్న మెట్రో రైలును తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ నరసింహన్ ప్రారంభించారు. నేడు 16 కిలోమీటర్ల మెట్రో మార్గం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రలు కేటీఆర్, నాయిని నర్సింహ్మారెడ్డితో పాటుగా పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రైలును జెండా ఊపి ప్రారంభించిన తరువాత వారు రైలులో అమీర్ పేట నుండి ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు.
* హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గం పొడవు 46 కిలోమీటర్లు
* నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ గత ఏడాది నవంబరు 28న ప్రారంభించారు.
* ఎంజీబీఎస్‌ స్టేషన్‌.. ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటి
* ఇది ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌.
* మియాపూర్‌ వాసులు ఎల్‌బీనగర్‌ వరకు వెళ్లాలంటే అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో మారాల్సిన అవసరం లేదు.
* ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌ అండ్‌ టీ రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది
* భూ సేకరణ ఖర్చు ప్రభుత్వానిది.
* ప్రపంచంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు

Wanna Share it with loved ones?