హైదరాబాద్ మెట్రోపై అసత్య ప్రచారం…

కొద్ది రోజుల క్రితమే ప్రారంభమై విజయవంతంగా నడుస్తున్న హైదరాబాద్ మెట్రో పై సామాజిక మాధ్యమాల్లో వధంతులు ప్రచారం అవుతున్నాయి. హైదరాబాద్ మెట్రో పిల్లర్ విరిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారం హైదరాబాద్ వాసులను అయోమయానికి గురిచేస్తోంది. మెట్రో పిల్లర్ కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చాలా రోజుల క్రితమే ఇదే ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శమిచ్చింది. ఐఎస్ బీ-గచ్చిబౌలీ మార్గంలోని మెట్రోల్ పిల్లర్ కు పగుళ్లు వచ్చాయనేది దాని సారాంశం. దీనిపై మెట్రో అధికారులు స్వయంగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవాలు లేవని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. అసలు ఐఎస్ బీ-గచ్చీబౌలీ మార్గంలో మెట్రో నిర్మాణామే జరగడం లేదన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నది పాకిస్థాన్ కు చెందిన పేషావర్ పట్టాణానికి చెందినదని ఆయన వివరించారు. హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చులేని వ్యక్తులు ఇటువంటి అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో పిల్లర్ల నాణ్యతపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదన్నారు. అత్యన్నత సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిన పిల్లర్లు టన్నులకొద్ది బరువును తట్టుకోవడంతో పాటుగా భూకంపాలవల్ల కూడా దెబ్బతినకుండా ఉండేలా నిర్మించామన్నారు.