ఆందోళనకు దిగిన హోంగార్డులు-రోడ్డు పై భైఠాయింపు

ఉద్యోగాల కోసం హోంగార్డులు ఆందోళన చేపట్టారు. అకారణంగా తమను విధుల్లో నుండి తొలగించారని, వెంటనే తమను ఉద్యోగంలోకి తీసుకోవాలంటూ వారు ఖైరతాబాద్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. బలవంతంగా ఆందోళనను విరమింపచేస్తే ఇంటికి వెళ్లి భార్యా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటామంటూ వారు హెచ్చరించారు. హోంగార్డుల ఆందోళనతో నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ రోడ్డు పై ట్రాఫిక్ ఆగిపోయింది. వాహనాల రాకపోకలకో అంతరాయం కలగడంతో క్షణాల్లో ట్రాఫిక్ జాం అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలకు ముందు ఆర్డర్ కాపీలు లేవనే కారణంగా 350 మంది హోం గార్డులను విధుల్లో నుండి తొలగించారు. వీందరికీ యూనిఫాం తో సహా గుర్తింపు పత్రాలు ఉన్నాయి. వీరందరికీ ప్రభుత్వ ఖజానా నుండే జీతాలు అందాయి. అయితే సాంకేతిక కారణాలను చూపుతూ వీరిని ఉద్యోగాల నుండి తీసేయడంతో వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత ఆయన తమకు హామీ ఇచ్చారని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవలంటూ ఆదేశాలు జారీచేశారని హోంగార్డులు చెప్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. తమను సరైన కారణం లేకుండానే ఉద్యోగాల నుండి తొలగించారని వెంటనే తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ వారు ఆందోళన నిర్వహించారు.
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్క ఉదుటున వచ్చిన హోంగార్డులు నిరసనకు దిగారు. మండుటెండలో వారితో బాటుగా వారి భార్యా పిల్లలు కూడా రోడ్లపై భైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదుల చేశారు. తమకు ఉన్నతాధికారుల నిండి స్ఫష్టమైన హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆందోళన చేస్తున్న హోంగార్డుల్లో ఒకరు అక్కడే ఉన్న హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపాడు. తమకు న్యాయం చేయకుంటే కిందికి వచ్చేది లేదనడంతో కొద్దిసేపు ఉధ్రిక్తతకు దారితీసింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఉన్న ఫళంగా ఉద్యోగాలు పోవడంతో రోడ్డున పడ్డామని భార్యా పిల్లలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న తమకు న్యాయం చేయాల్సిందిగా వారు ప్రభుత్వాన్ని కోరారు. కేవలం ఆర్డర కాపీలు లేవనే కారణంగా తమకు పక్కనపెట్టారని ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని వారంటున్నారు. ఎన్నిసార్లు ఉన్నాతాధికారులను కలిసినా సమస్యకు పరిష్కారం లభించలేదని తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చిందని వారు చెప్పారు. తమ సమస్యపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని లేకుండా తమకు ఆత్మహత్యే శరణ్యమని ఈ మాజీ హోంగార్డులంటున్నారు.
home guards, home guards dharna,hyderabad, telangana home guards, home guards salary, telangana, andhra pradesh, united andhra pradesh, police department, telangana cm, telangana cm kcr, telangana home guards problems, home guards agitation, telangana police, united andhra pradesh police.

ఉత్తర కొరియా వైఖరిలో ఎందుకీ మార్పు…?


ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఎంపికకు కారణం అదేనా…!
Telangana_State_Police