హింధూ ధర్మం కోసం ప్రాణాలిస్తాం…

హింధూ సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోమంటు హింధు సంస్థల ప్రతినిధులు, ప్రజలు ప్రతిన బూనారు. బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో ఉన్న వేదపాఠశాలను తొలగించాలంటూ కొంత మంది చేస్తున్న ఒత్తిడి, పాఠశాల నిర్వహాకులపై బెదిరింపుల నేపధ్యంలో పెద్ద సంఖ్యలో వివిధ హింధు, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు స్థానిక మల్లన దేవాలయంలో సమావేశమయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఈ కార్యక్రమానికి హాజరై తన సంఘీభావాన్ని ప్రకటించారు. వేద భూమిగా పిల్చుకునే భారత్ లో వేదాలను కించపర్చే విధంగా ఎవరు మాట్లాడినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. వేదాలతోనే మనం పునీతులం అవుతామని అటువంటిది వేద పాఠశాలను తొలగించాలని బెదిరింపులకు పాల్పడడంతో పాటుగా అసభ్య పదజాలంతో దూషించడం ఎంతమాత్రం సరికాదన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వేద ఘోషను అవమానించే విధంగా మాట్లాడిన బొమ్మక్ మురళిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వేద పాఠశాలను నిర్వహిస్తున్న సోమయాజుల ను నోటికి వచ్చినట్టు తిట్టిన మురళిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.
దేవాలయం నుండి వేద పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎటువంటి నినాదాలకు తాపులేకుండా మౌన ర్యాలీ నిర్వహించారు. వేదపాఠశాల ఉన్న కాలనీలోనికి వచ్చే క్రమంలో ర్యాలీని అడ్డుకునేందుకు కొంత మంది చేసిన ప్రయత్నం స్వల్ప ఉధ్రిక్తతకు దారితీసింది. దారికి అడ్డంగా కారును ఉంచడంతో పాటుగా మహిళలను ముందు ఉంచి ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సకాలంలో స్పందిచిన పోలీసులు వారిని పక్కకు తొలగించడంతో ర్యాలీ వేద పాఠశాల వద్దకు చేరుకుంది.
పాఠశాల వద్ద విద్యార్థులకు సంఘీభావం తెలిపిన ప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేద పాఠశాలను ఇక్కడి నుండి తొలగించేది లేదని అన్నారు. ఎవరు అడ్డుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అటునుండి కాలనీ మైదానంలో నిర్వహించిన సభలో పలువురు ప్రసంగించారు. హింధువులపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. కుహన మేధావులు హింధువుల సంస్కృతిని కింపర్చేవిధంగా ప్రవర్తిస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. హింధు సంస్థల ఐక్యతగా ఉంటే ఇటువంటి వారిని తరిమికొట్టడం చాలా సులభమేనన్నారు.

related news:http://telanganaheadlines.in/2017/11/26/bommak-murali/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *