వరదలతో హిమాచల్ అతలాకుతలం

హిమాచల్ ప్రదేశ్ ను మంచు తుపాను, భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాలవల్ల నదులు పొంది పొర్లుతున్నాయి. పూర్తిగా కొండ ప్రాంతాలు కావడంతో ఆఖస్మికంగా వరదలు ముంచెత్తున్నాయి. బస్సు, లారీలతో సహా పెద్ద వాహనాలు వరదనీటిలో కొట్టుకుని పోయాయి. పెద్ద సంఖ్యలో కార్లు కూడా కొట్టుకుని పోయినట్టు తెలుస్తోంది. రావి నదితో పాటుగా చిన్న చిన్న నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అఖస్మాత్తుగా వరదలు ముంచెత్తుతుండడంతో రాష్ట్రంలోని జాతీయ రహదారులను మూసివేశారు.
వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రగంలోకి దిగాయి. సైనిక దళాలు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. కులూ జిల్లా పరిధిలోని డోబు ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని వాయుసేన రక్షించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం కులుతో సహా అనేక చోట్ల వరదలు భీబత్సం సృష్టిస్తున్నాయి.