ఉగ్రవాదుల కదలికలపై అనుమానాలు-తిరుమలలో హై అలెర్ట్

0
73

High alert in Tirumala has been announced.
ఉగ్రవాదుల కదలికలపై అనుమానాలు-తిరుమలలో హై అలెర్ట్
తిరుమల లో హై అలెర్ట్ విధించారు. శ్రీలంకలో బాంబు దాడులకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ తిరుపతి, తిరుమలల్లో రెక్కీ నిర్వహించినట్టుగా నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో పోలీసులతో పాటుగా తిరుమలలోని ఇంటలెన్స్ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. శ్రీలంకలోని చర్చీల్లో బాంబు దాడులకు పాల్పడడం ద్వారా వందలాది మంది ప్రాణాలను బలిగొన్న అల్ ఉమా సంస్థకు చెందిన కొందరు తీవ్రవాదులు తిరుపతి, తిరుమల ప్రాంతాలను సందర్శించారని పోలీసులకు సమాచారం అందింది.
బాంబు దాడులకు పాల్పడిన ఉగ్రవాద ముఠా సభ్యులను కొంతమందిని పట్టుకున్న శ్రీలంక పోలీసులు జరిపిన విచారణలో వీరు తిరుపతి, తిరుమల ప్రాంతాలను సందర్శించినట్టు తేలినట్టు తెలుస్తోంది. దీనితో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటుగా తిరుపతి వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
Gold seized by TN police belongs to TTD

Wanna Share it with loved ones?