హైదరాబాద్ లో భారీ వర్షం | Heavy rain in hyderabad

హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. దీనితో మండిపోతున్న ఎండల నుండి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం హఠాత్తుగా మారిపోయింది. మేఘాలు కమ్ముకోవడంతో చీకటి పడినట్టయింది. మబ్బులు చాలా తక్కువ ఎత్తులో కమ్ముకోవడంతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
భారీ ఈదురుగాలులకు హోర్డింగ్ లు కిందపడగా.. చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అనేక ప్రాంతాల్లో విద్యుతు సరఫరాను నిలిపివేశారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఉప్పల్, హబ్సీగూడ,తార్నాకా బేంగపేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, కోఠి, సైదాబాద్, మలక్ పేట, దిల్ షుఖ్ నగర్ , వనస్థలిపురం ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది.
నగరవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. ఎండలకు అల్లాడుతున్న జనాలు వర్షం వల్ల కొంత సేదదీరారు. పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఈదురు గాలులతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
rain, heavy rain, rain in hyderabad, hyderabad, telangana, telangana headlines, telangana headlines news.delhi
_CarmenTropical_cyclone