చిక్కుల్లో పడ్డ మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి

0
88
చిక్కుల్లో పడ్డ భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి
చిక్కుల్లో పడ్డ హర్మీన్ కౌర్

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి హర్మీన్ చిక్కుల్లో పడింది. పంజాబ్ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఆమె నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్టుగా ఆరోపణున్నాయి. దీనితో ఇప్పటికే పంజాబ్ పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆమెను రివర్ట్ చేసి కానిస్టేబుల్ గా ఉద్యోగం ఇస్తామని పంజాబ్ పోలసు వర్గాలు చెస్తున్నాయి. దేశం తరపున క్రికెట్ ఆడుతున్నందున ఆమె కెరీర్ ను దృష్టిలోపెట్టుకుని ఆమెపై కేసును నమోదు చేయడంలేదని పంజాబ్ పోలీసులు స్పష్టం చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టు తరపున ఆడుతున్న హర్మీన్ తన ఆటతీరుతో అందరి మన్నలను అందుకున్నారు. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరడంలో హర్మీన్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆమె ఆటతీరుకు క్రికెట్ ప్రేమికులు ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఆమె పేరు భారత్ అంతటా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె స్వంత రాష్ట్రం పంజాబ్ ప్రభుత్వం ఆమెకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పంజాబ్ పోలీసు శాఖలో ఆమెకు డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది. స్వయంగా పంజాబ్ ముఖ్యమంత్రి ఆమెకు నియామక పత్రాలు అందచేశారు.
ఉద్యోగం కోసం హర్మీన్ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్ పై నిబంధనల్లో భాగంగా విచారణ జరిపిన పోలీసులకు అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి. ఆమె మీరట్ లోని చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తిచేసినట్టుగా సర్టిఫికెట్ లు ఇచ్చినప్పటికీ సదరు విశ్వవిద్యాలయంలో ఆమె చదవలేదని పోలీసుల విచారణలో తేలింది. దీనితో ఈ విషయాన్ని పోలీసులు ప్రభుత్వ వర్గాల దృష్టికి తీసుకుని వెళ్లాయి. డిగ్రీ పూర్తి చేయకపోవడంతో ఆమె 12వ తరగతి మాత్రమే పాస్ అయినట్టు భావిస్తూ డీఎస్పీ నుండి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసు శాఖ తెలిపింది. ఆమె క్రికెట్ కెరీర్ ను దృష్టిలోపెట్టుకుని హర్మీన్ పై ఎటువంటి చట్టపరమైన చర్య తీసుకోవడం లేదని పోలీసు శాఖ వెల్లడించింది.
హర్మీన్ కు భారత ప్రభుత్వం అర్జున అవార్డును సైతం అందచేసింది. ప్రస్తుతం ఆమె కియా సూపర్‌ లీగ్‌లో ఆడేందుకు స్మృతి మంధానతో కలిసి త్వరలో ఇంగ్లాండ్‌ వెళ్లనుంది.
Harmanpreet Kaur , indian, india, indian women, indian women cricketer, cricket, women star player, punjab, police.

కత్తి మహేష్ పై పోలీసుల భహిష్కరణ వేటు


గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…
Harmanpreet_Kaur

Wanna Share it with loved ones?