అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంత్యక్రియలు

0
53
nandamuri hari krishna

వేలాది మంది అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బంధువుల అశ్రునయనాల మధ్య సినీ నటుడు, మాజీ మంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ తండ్రి చితికి నిప్పంటించాడు. హరికృష్ణ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున ఆయన అభిమానులు నినాదాలు చేస్తుండగా ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సహా పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హరికృష్ణకు గౌరవసూచకంగా పోలీసులు మూడుసార్లు గాలిలో తుపాకులు పేల్చి నివాళ్లు అర్పించార.
అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించిన కుమారుడు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు భోరున విలపించారు. సోదరుడు బాలకృష్ణ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు మాసబ్ ట్యాంక్ లోని హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు సాగింది. దారిపొడవునా పెద్ద సంఖ్యలో హరికృష్ణ అభిమానాలు బారులుతీరి నిల్చున్నారు. అంతిమ యాత్రలో వేలాది సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు.
తెలంగాణ మంత్రులు మహమూద్‌అలీ, కేటీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు కవిత, బాల్క సుమన్‌, ఏపీ మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, జవహర్‌, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, టీడీపీ ఎంపీలు మాగంటి బాబు, సీఎం రమేష్‌, వైకాపా నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే కొడాలి నాని, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, దగ్గుబాటి సురేష్‌బాబు, అక్కినేని నాగార్జున దంపతులు, జగపతిబాబు, కోట శ్రీనివాసరావు, కవిత, వేణుమాదవ్‌, రఘుబాబు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మాజీ ఎంపీ రేణుకాచౌదరి, అంజన్‌కుమార్‌యాదవ్‌, పొన్నాల తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
hari krishna,

Wanna Share it with loved ones?