తాను నంపుశకుడినంటున్న గుర్మీత్

0
65

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా సచ్చా సౌధా అదినేత రామ్ రహీమ్ గుర్మీత్ సింగ్ తాజాగా మరో సంచలనాన్ని బయట పెట్టాడు. అత్యాచారం కేసులో తనకు విధించిన శిక్ష సరికాదని తాను 1990లోనే నంపుశకుడిగా మారినట్టు చెప్పుకొచ్చాడు. 1990లోనే నంపుశకుడిగా మారిన తాను 1999లో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసే అవకాశమే లేందటూ తనకు విధించిన శిక్షను నిలిపివేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించాడు. అయితే ఈ వాదనలను కోర్టు కొట్టివేసింది. కేవలం శిక్ష నుండి తప్పించుకునేందుకు గుర్మీత్ ఇటువంటి వాదనలను తెరపైకి తీసుకుని వస్తున్నాడంటూ పేర్కొంది.
మరో వైపు గుర్మీత్ కేసులో బాధితురాలు కోర్టుకు అనేక విషయాలను వెల్లడించింది. తనపై అత్యాచారానికి తెగబడిన గుర్మీత్ ఈ విషయాన్ని ఎక్కడైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగినట్టు చెప్పింది. ఈ విషయాన్ని తన సోదరుడితో చెప్తే అతన్ని కూడా చంపెస్తానని హెచ్చరించినట్టు బాధితురాలు కోర్టుకు తెలిపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here