అక్రమ విదేశీ ఏజెంట్లకై కఠిన చర్యలు

తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు అక్రమంగా పంపుతున్నవారిపై కఠిన చర్యలకు సర్కారు నడుంబిగించింది. సరైన విసా లేకుండా విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు అమాయకులను ఏజెంట్లు పంపుతున్నారు. దీనితో అక్కడ వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని తిరిగి స్వదేశానికి రప్పించడం ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో విదేశాలకు అమాయకులను అక్రమ పద్దతుల్లో పంపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నారై శాఖల సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటుగా పలువురు ఉన్నాతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అందరు ఏజెంట్లు నెలలోగా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని అట్లా నమోదు చేసుకోని వారిని అక్రమ ఏజెంట్లుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపే పోలీసు కేసులు నమోదు చేయాన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి మహిళల అక్రమరవాణ పెరిగిపోతున్న సమయంలో దినిపై కఠినంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది.గల్ఫ్ దేశాల్లో ఉపాధికోసం మహిళలను తరలిస్తూ అక్కడ వారిచేత ఇండ్లలో పనిచేయిస్తున్నారు. అక్కడి షేక్ ల వలలో చిక్కుకుని మహిళళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైంగికలంగా వేధింపులకు గురవుతున్నారు.
ఉపాధి పేరుతో విజిటింగ్ విసాల పై గల్ఫ్ దేశాలకు అమాయకులను పంపుతున్నారు. దీనితో వారు అక్కడ పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. కొంత మంది వెట్టిచాకిరి చేయాల్సి వస్తోంది. పాస్ పోర్టులను లాగేసుకోవడం, జైల్లో తోస్తామంటూ బెదిరింపులకు దిగుతూ జీతం కూడా ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వైనాలు ఎన్నో బయటికి వచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *