గుజరాత్ ఎన్నికలకు సర్వం సిద్ధం

0
51

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. 182 నియోజకవర్గాలున్న గుజరాత్ అసెంబ్లీకి రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ పోలింగ్ ఈనె 9న ముగియగా రెండో దశ పోలింగ్ గురువారం జరగనుంది. రెండో దశలో మొత్తం 851 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం అన్నిరకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధిరార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్న ఈ ఎన్నికలు ఇరు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 20 సంవత్సరాలకు పైగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారాన్ని నిల్పుకునే ప్రయత్నం చేయగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. గుజరాత్ లో కాంగ్రెస్ గతంలో కంటే పుంజుకున్నట్టు సర్వేల్లో తేలింది. ఇరు పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం సాగడంతో కొన్ని సార్లు ఎన్నికల ప్రచారం శృతి మించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోడీని నీచ్ ఆద్మీగా సంబోదించి వివాదం సృష్టించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతలను పార్టీ నుండి బహిష్కరించింది. ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ కు చెందిన నేతలు బీజేపీనీ ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ కు చెందిన వారి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తోందటూ స్వయంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ పైనే మోడీ ఈ ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్ఫందించింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మోడీ మన్మోహన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here