177 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు

0
76

జీఎస్టీ పన్ను శ్లాబ్ విధానంలో తెచ్చిన మార్పుల వల్ల మరో 177 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ వస్తువలపై ప్రస్తుతం 28 శాతంగా ఉన్న పన్నును 18 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో ఇక నుండి 28 శాతం పన్నులలో కేవలం 50 వస్తువులు మాత్రమే ఉన్నట్టయింది. పన్ను తగ్గిన వాటిలో టాక్లెట్లు, చూయింగ్ గమ్ లు, డియోడరంట్, షూ పాలీష్ , కాస్మెటిక్స్ ఉన్నాయి. గౌహతీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 227 వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తుండగా వాటిలో 177 వస్తువులపై పన్నును పదిశాతం మేరకు తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఏటా 20 వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయి.
అయితే 177 వస్తువులపై 28 శాతం నుండి 18 శాతానికి పన్నును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ సిమెంట్, పెయింట్లు, వాషింగ్ మిషన్లు, ఎసీ లాంటి వస్తువులను మాత్రం 28 శాతం పన్నుల విభాగంలోనే ఉంచారు. వీటిపై పన్నును తగ్గించాల్సిందిగా వస్తున్న డిమాండ్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా సిమెంట్ పై పన్నును తగ్గించాల్సిందిగా ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here