మచ్చబొల్లారం గోశాలను తెరిపించాలి:హింధు సంఘాల డిమాండ్

0
79
మచ్చబొల్లారం
goshala in macha bollaram

మేడ్చెల్ జిల్లా మచ్చబొల్లారం లోని ఎంజీ నగర్ లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న గోశాలను వెంటనే తెరిపించాలని హింధు సంఘాలు, నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ కు ఒక వినతి పత్రాన్ని అందచేశారు. గోశాలను మూసివేడంతో పాటుగా అందులోని విగ్రహానికి పూజలు లేకుండా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గోశాలను తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గోశాలను మూసివేయడం వల్ల గోవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు చెప్పారు.
మచ్చబొల్లారం లోని హింధు శ్మసానవాటిక సంఘం తమకు గోశాల నిర్వహించుకునేందుకు స్థలాన్ని కేటాయించినట్టు వారు పేర్కొన్నారు. ఇప్పటికే హింధూ శ్మాసానవాటికకు చెందిన స్థలంలో చాలా భాగం అన్యాక్రాంతం అయిందని, అందులో నుండి కొంత భాగాన్ని గోశాల కోసం సొసైటీ అనుమతితో ఏర్పాటు చేసినట్టు వారు వివరించారు. హింధు సంప్రదాలయ ప్రకారం శ్మశానవాటికలో కర్మఖాండల నిర్వహణకు గోవుల అవసరం ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
గోశాలను మూయించేందుకు కొంత మంది తెరవెనుక ప్రయత్నాలు చేశారని దానిలో భాగంగానే గోశాల నిర్వహకులపై తీవ్ర వత్తిడితెచ్చారని, వారిపై బెదిరింపులకు దిగుతున్నారని వారు పేర్కొన్నారు. గోశాలకు సమీపంలోని కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను గోశాల నిర్వహకులు తిప్పికొట్టడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని తమపై అక్రమ కేసులు బానాయించారని బృందావన్ గోశాల అధ్యక్షుడు ఆశిష్ తెలిపారు. ప్రభుత్వ భూమిని తాము కాపాడేందుకు ప్రయత్నించడం కబ్జాదారులకు కంటగింపుగా మారిందని దీనితో తమను ఇక్కడి నుండి తరిమివేసేందుకు కుట్రలు చేసి తమ గోశాలను జప్తు చేయించారని ఆయన చెప్పారు.
ఈ వ్యవహారంలో కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆశిష్ ఆరోపించారు. కబ్జాదారుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు గోశాలను మూసేశారని స్థానిక కాలనీ ప్రజలు, హింధుల మనోభావాలను గాయపర్చే విధంగా వారు వ్యవహరించారని ఆశిష్ పేర్కొన్నారు. స్థానికంగా కొంత మంది అధికారుల తీరు సరిగా లేదని ఆయన అన్నారు.
హింధువుల నిర్వహిస్తున్న దేవాలయాలు, గోశాలల విషయంలో ఓ మాదిరిగా ఇతర వర్గాలకు చెందిన వ్యవహారాల్లో మరో మాదిరిగా వ్యవహరిస్తూ పక్షపాత బుద్దిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తాము హింధు శ్మాశానవాటిక స్థలంలో వారి అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన గోశాలను బలవంతంగా మూయించిన అధికారులకు ప్రభుత్వ స్థలంలో కొత్తగా పుట్టుకుని వచ్చిన మరో వర్గం వారి ప్రార్థనా మందిరాలు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
మచ్చబొల్లారంలోనే నిబంధనలకు విరుద్దాంగా కట్టిన చర్చీ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకుండా హింధువులకు చెందిన గోశాల విషయంలోనే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కొంత మంది అధికారల ప్రోద్బలంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ హింధు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తిగా నిబంధనలు వ్యతిరేకించిన వారిని వదిలిపెట్టి తమ వర్గానికి చెందిన గోశాలను స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ స్థలంలో చర్చి వెలిసినట్టు తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా దానిపై కనీసం చర్యతీసుకోకుండా అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన గోశాలను మాత్రం మూసేయించారని వారు చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

వైభవంగా శ్రీ కరిగిరి వేంకటేశ్వర స్వామి రథోత్సవం
jai sri ram

Wanna Share it with loved ones?