ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం

0
104
gold medal for india

gold medal for india ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. భారత కుస్తీ క్రీడాకారిణి సంచలనం సృష్టిస్తూ స్వర్ణాన్ని దక్కించుకుంది. ఆసియా క్రీడల్లో ఓ భారత మహిళా క్రీడాకారిణి స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. రెజ్లర్ వినీశ్ ఫోగాట్ ఈ చరిత్రను సృష్టించింది. 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో ఫోగాట్ స్వర్ణ పతాకాన్ని సాధించింది. ఫైనల్ పోరులో ఆమె జపాన్ కు చెందిన ఇరీ యుకి ని ఓడించి స్వర్ణపతాకాన్ని ఎగరేసుకునిపోయింది. ఈ పోటీలో ఆమె యుకి పై 6-2 తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలో తొలిరౌండు నుండి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఫోగాట్ తొలి రౌండులోనే 4-0 ఆధిఖ్యాన్ని సంపాదింంచుకుంది. రెండో రైండ్ లో ఇద్దరికీ చెరో రెండు పాయింట్లు వచ్చాయి. ఎక్కడా పట్టుకోల్పోని ఫోగాట్ చివరకు 6-2 స్కోరుతో స్వర్ణాన్ని సాధించింది.
పతకంపై ఆశలతో అసియా క్రీడల్లో అడుపెట్టిన ఫోగాట్ మొదటి నుండి దూకుడుగా ఆడుతోంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ వచ్చింది. చైనాకు చెందిన సన్ యానాన్ ను 8-2తో ఓడించడం ద్వారా క్వార్టర్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. రియో ఒలింపిక్స్ లో సన్ యానాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఆసియా క్రీడల్లో ప్రతీకారం తీర్చుకుంది. క్వార్టర్ లో కొరియా క్రీడాకారిణి కిమ్ ను 11-0తో ఓడించింది. సెమీస్ లో ఉజ్బెకిస్థాన్ కుస్తీ క్రీడాకారిణి యాక్షిమురతోవా ను 10-0 ఓడించి సంచలనం రేపిన ఫోగాట్ ఫైనల్ లోనూ సత్తా చాటుతూ జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి భారత్ కు పసిడి పతకాన్ని అందించింది.
vinesh Phogat,gold medal, 2018 Asian Games, Japan’s Yuki Irie, Freestyle 50 kg, first female gold medal winner, Phogat.

కేరళ వరదలకు కారణం- దేవుడి శాపమా..? మనిషి పాపమా…?


కేరళ వరదలు , సహాయం పై అనుచిత వ్యాఖ్యలు-ఊడిన ఉద్యోగం
asiangames 2018

Wanna Share it with loved ones?